నేను ఇన్ని రోజు డాలరుతో రూపాయి విలువ పెరగటం వలన మనకు ఇక్కడ అన్నీ లాభాలే అని భావిస్తూ ఉండేవాడిని. అంటే డాలరు విలువతో మన రూపాయి విలువ సమానంగా అవుతున్న కొద్దీ ఇక్కడ మన జీవన ప్రమాణాలు కూడా అమెరికా జీవన ప్రమాణాలకు దగ్గరగా అవుతాయి అని అనుకుంటూ ఉండే వాడిని. 1000 డాలర్లు ఉండే ల్యాప్‌టాపుని ఇప్పుడు 40000 రూపాయలకే కొనుక్కోవచ్చు, అంటే ఇక్కడ మనం సుమారు 10000 మిగుల్చుకున్నాము. ఇంకో రకంగా చెప్పాలంటే రూపాయి విలువ పెరుగుతున్నంత కాలం, మన కొనుగోలు శక్తి పెరుతుంది. అంటే దిగుమతుల వ్యాపారం కనీ వీనీ ఎరుగనంత లాభాలు ఆర్జిస్తున్నాయన్నమాట.
కానీ ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే, రెండో వైపు ఎగుమతులు ఉన్నాయి. భారత దేశంలో ప్రస్తుతం మంచి ఊపు మీదున్న రంగమైన సాఫ్టువేరు రంగం, పూర్తిగా ఎగుమతుల మీదనే ఆధారపడుతున్న రంగం. ఈ రంగం అతిపెద్ద వినియోగదారుడు నిస్సంకోచంగా అమెరికానే. అయితే డాలరు విలువ 49 రూపాయల నుండి 40 రూపాయలకు పడిపోయిందంటే ఇది సాఫ్టువేరు కంపెనీలకు చాలా పెద్ద దెబ్బ. కంపెనీలకే కాదు వాటిలో పనిచేసే కూలీలకు కూడా ఈ దెబ్బ తగులుతుంది. అది ఎలా గంటే డాలరు విలువ పడిపోవటం వలన, ఇక్కడ రూపాయలలో జీతం తీసుకునే సాఫ్టువేరు కూలీలకు, జీతాలు పెంచక పోయినా కూడా ఎక్కువ డాలర్లు ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు సాఫ్టువేరు కంపెనీలు తమ మీదున్న భారాన్ని ఈ కూలీల పైకి కూడా తోసేయటానికి ప్రయత్నించవచ్చు.
ఒక సాఫ్టువేరు కూలీగా రూపాయి విలువ మళ్లీ పడిపోతే బాగున్ను అని అనిపిస్తుంది, కానీ ఒక భారతీయుడిగా చూస్తే ఇది మనందరికీ చాలా శుభసూచకం అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా మనదేశంలో మట్టుకు పెరగలేదు. ఇది పెరిగిన రూపాయి మహత్యమే. ఇలాంటి లాభాలు ఇంకా చాలా ఉంటాయి. వాటిలో ఒకటి మన మీద వేసే పరోక్ష పన్నులను తగ్గించటం, కూడా ఉండొచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment