Monday, August 27, 2007

నిజమైన ఆనందం

బ్లాగు మనసులోని మాటలకు అర్థం పడుతుందని విన్నాను కాని అది నా విషయం లొ అక్షరాల నిజం అయ్యింది. నా ఇంతకుముందు బ్లగులు అన్ని జతీయత మరియు ఐ.టి. కి సంబందించినవి . కాని ఇందులో నా మనోభావాలను వ్యక్తం చెస్తున్నాను. మాత్రుదేశానికి వెల్లడానికి సమయము ఇంకా కొన్ని గంటలు మత్రమే ఉందని తెలిసి నా మనసు అలొచనలో పడినది. నా యొక్క ఈ సెలవులని తలచుకున్నప్పుడు నా మనసు అంతులేని అనందంతొ పరవశిస్తుంది. మలేషియ వచ్చి దాదాపు సంవత్సరం అయ్యింది, గత ఐదు నెలలుగా ఈ అవకాశం కొసం ఎదురు చుస్తే చివరికి సెలవు మంజూరు అయ్యింది. ఇప్పుడు నా సొంతగడ్డ పై కాలు మోపే ఆ సమయం రానే వచ్చింది. తల్లిదండ్రులను భందుమిత్రులను కలవాలని తపిస్తు ఇంకొన్ని గంటలలొ మన దేశంలొ కలుద్దాం ..

ఇట్లు,
మీ ప్రియాతి ప్రియమైన
నవీన్ కుమార్ తలుసాని

Wednesday, August 15, 2007

అవని ప్రేమ

గుండె ఒక్కసారిగా తడిసి ముద్దవుతుంది.వంటి మీద వెంట్రుకలకి కూడా దేశభక్తి ఉందేమోదేశం పేరు చెప్పగానే నిక్కపొడుచుకొని మరీవందనాలర్పిస్తున్నాయి.కళ్ళు రెండూ కన్నీటి బిందువులవుతున్నాయి.జెండాకర్ర పతాకని మోస్తున్నట్లుకన్నీటి చారిక బుగ్గపై నిలబడి కళ్ళని మోస్తూరెప్పల ముడిలాగినప్పుడల్లాఅశ్రు బిందువుల్ని పువ్వుల్లా జలజలా రాలుస్తున్నాయి.నిన్న - నన్ను ధన్య జీవిలా నిలబెట్టిన ఈ నేలతమ స్వేద బిందువులతో స్వాతంత్ర్యపు పాదుల్నితడిపిన త్యాగధనుల్ని కన్న ఈ నేలనాదేనన్న భావం రాగానే శరీరం మొత్తంప్రకంపనల పరవళ్ళతో పులకరించిపోతుంది.దేశంలోని మట్టి మొత్తాన్నినలుగు పిండిలా పులుముకోవాలన్నదే తపన.ప్రకృతి మొత్తాన్ని గాఢ పరిష్వంగం చేసిగుండెల్లో నిలుపుకోవాలన్నదే ఆవేశం.అవని ప్రేమ అణువణువునా పులకరించడం కన్నాఒక భారతీయునికి ఇంకేం కావాలి

Saturday, August 11, 2007

డాలరుతో రూపాయి విలువ

నేను ఇన్ని రోజు డాలరుతో రూపాయి విలువ పెరగటం వలన మనకు ఇక్కడ అన్నీ లాభాలే అని భావిస్తూ ఉండేవాడిని. అంటే డాలరు విలువతో మన రూపాయి విలువ సమానంగా అవుతున్న కొద్దీ ఇక్కడ మన జీవన ప్రమాణాలు కూడా అమెరికా జీవన ప్రమాణాలకు దగ్గరగా అవుతాయి అని అనుకుంటూ ఉండే వాడిని. 1000 డాలర్లు ఉండే ల్యాప్‌టాపుని ఇప్పుడు 40000 రూపాయలకే కొనుక్కోవచ్చు, అంటే ఇక్కడ మనం సుమారు 10000 మిగుల్చుకున్నాము. ఇంకో రకంగా చెప్పాలంటే రూపాయి విలువ పెరుగుతున్నంత కాలం, మన కొనుగోలు శక్తి పెరుతుంది. అంటే దిగుమతుల వ్యాపారం కనీ వీనీ ఎరుగనంత లాభాలు ఆర్జిస్తున్నాయన్నమాట.

కానీ ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే, రెండో వైపు ఎగుమతులు ఉన్నాయి. భారత దేశంలో ప్రస్తుతం మంచి ఊపు మీదున్న రంగమైన సాఫ్టువేరు రంగం, పూర్తిగా ఎగుమతుల మీదనే ఆధారపడుతున్న రంగం. ఈ రంగం అతిపెద్ద వినియోగదారుడు నిస్సంకోచంగా అమెరికానే. అయితే డాలరు విలువ 49 రూపాయల నుండి 40 రూపాయలకు పడిపోయిందంటే ఇది సాఫ్టువేరు కంపెనీలకు చాలా పెద్ద దెబ్బ. కంపెనీలకే కాదు వాటిలో పనిచేసే కూలీలకు కూడా ఈ దెబ్బ తగులుతుంది. అది ఎలా గంటే డాలరు విలువ పడిపోవటం వలన, ఇక్కడ రూపాయలలో జీతం తీసుకునే సాఫ్టువేరు కూలీలకు, జీతాలు పెంచక పోయినా కూడా ఎక్కువ డాలర్లు ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు సాఫ్టువేరు కంపెనీలు తమ మీదున్న భారాన్ని ఈ కూలీల పైకి కూడా తోసేయటానికి ప్రయత్నించవచ్చు.

ఒక సాఫ్టువేరు కూలీగా రూపాయి విలువ మళ్లీ పడిపోతే బాగున్ను అని అనిపిస్తుంది, కానీ ఒక భారతీయుడిగా చూస్తే ఇది మనందరికీ చాలా శుభసూచకం అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా మనదేశంలో మట్టుకు పెరగలేదు. ఇది పెరిగిన రూపాయి మహత్యమే. ఇలాంటి లాభాలు ఇంకా చాలా ఉంటాయి. వాటిలో ఒకటి మన మీద వేసే పరోక్ష పన్నులను తగ్గించటం, కూడా ఉండొచ్చు.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు

అమరావతీనగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగుతల్లీ, జై తెలుగు తల్లీ!

- శంకరంబాడి సుందరాచార్య

Great day

ఎందరొ మహానుభావులు అందరికి నా వందనములు..ఈ నాడు ఎంతొ శుభదినం..మనం అందరం అలొచించి అడుగు వెస్తున్న శుభతరునం...నా మనవి ఎమిటి అంటే అందరం కలిసికట్టుగా తొడ్పడుతూ ముందుకు అడుగు వెద్దాం.ఇక సెలవు మీ నవీన్